Current Affairs Telugu Daily

జీఎస్టీ పన్ను రేట్లకు ఆమోదం
జీఎస్టీ పన్ను నాలుగు శ్లాబులుగా 5, 12, 18, 28 శాతం పన్ను రేట్లు వసూలు చేయాలని జీఎస్టీ కౌన్సిలర్ గురువారం నిర్ణయించింది. ఎక్కువశాతం వస్తువులు తక్కువ పన్ను పరిధిలోకి  తీసుకురావడం ఆవశ్యక వస్తువులపై (ఆహార ధాన్యాలు వాంటివి) ఎలాంటి పన్ను విధించకూడదన్న ప్రతిపాదనల్ని భేటిలో ఏకగ్రీవంగా అంగీకరించారు.
వినియోగ ధరల సూచీలో (సీపీఐ) లో ఉన్న దాదాపు 50 వస్తువులపై సున్నా శాతం వసూలు
నిత్యావసర వస్తువులపై కనిష్ఠ పన్ను రేటు 5% అమలు చేస్తారు.
12, 18% కేటగిరీలో వాషింగ్ మెషీన్లు, ఏసీలు, రిఫ్రిజిరేట్లు, షాంపులు, షేవింగ్ సామాగ్రి సబ్బులు మొదలగునవి.
లగ్జరీ కార్లు, పాన్‍మసాలా, పొగాకు శీతల పానీయాలపై 40 - 65% పన్ను (సెస్సులతో కలిపి) వసూలు
సీజీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాలు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందుతాయని జీఎస్టీ 2017 April 1st నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు.

views: 957

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams