Current Affairs Telugu Daily

తేజస్‌లో అమెరికా వాయుసేనాధిపతి జనరల్‌ డేవిడ్‌ ఎల్‌ గోల్డ్‌ఫిన్‌
భారత్‌ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తేజస్‌లో 2018 ఫిబ్రవరి 4న అమెరికా వాయుసేన చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌, జనరల్‌ డేవిడ్‌ ఎల్‌ గోల్డ్‌ఫిన్‌ ప్రయాణించారు. ఇలా ఓ విదేశీ జనరల్‌ భారతీయ జెట్‌లో ప్రయాణించడం భారతీయ వాయుసేన చరిత్రలో ఇదే తొలిసారి.
  • జనరల్‌ గోల్డ్‌ఫిన్‌ ఇప్పటివరకూ 42 వేల గంట పాటు యుద్ధవిమానాలను నడిపారు.
  • గల్ఫ్‌ యుద్ధం, ఆప్ఘనిస్థాన్‌ సంక్షోభం, యుగోస్లేవియాతో జరిగిన యుద్ధంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
  • 1999లో ఓ ఆపరేషన్‌ సందర్భంగా గోల్డ్‌ఫిన్‌ నడుపుతున్న యుద్ధ విమానాన్ని శత్రువు క్షిపణి కూల్చేసింది. కానీ, ఆ ప్రమాదంలో పారాచ్యూట్‌ ద్వారా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.

views: 1076

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams