Current Affairs Telugu Daily

ప్రపంచంలోనే బుల్లి రాకెట్‌ ప్రయోగించిన జపాన్‌
ప్రపంచంలోనే అత్యంత బుల్లి రాకెట్‌ను జపాన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) విజయవంతంగా ప్రయోగించింది. సూక్ష్మ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం దీనికి ఉంది. ఒక విఫల ప్రయత్నం, పలుమార్లు వాయిదా తర్వాత ఈ ప్రయోగం జరిగింది.
  • చౌకైన ఈ రాకెట్‌ పొడవు 10 మీటర్లు, వ్యాసం 53 సెంటీమీటర్లు.
  • కగోషిమా ప్రిఫెక్చర్‌లోని ఉంచినోరా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
  • టోక్యో యూనివర్సిటీ రూపొందించిన 3 కిలోల ఉపగ్రహాన్ని ఇది కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
  • భూ ఉపరితలాన్ని ఫొటో తీయడానికి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
  • ప్రైవేటు రంగం నుంచి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో చౌకలో సూక్ష్మ ఉపగ్రహాలను ప్రయోగించే తన సామర్థ్యాన్ని చాటడానికి జపాన్‌ ఈ ప్రయోగం చేపట్టింది.

views: 1167

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams