Current Affairs Telugu Daily

గాంధీజీ ‘హే రామ్‌’ అనలేదని నేను ఎప్పుడూ చెప్పలేదు : వి.కల్యాణం 
జాతిపిత మహాత్మాగాంధీ చివరి క్షణాల్లో ‘‘హే రామ్‌’’ అని అనలేదంటూ దశాబ్దం క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన వ్యక్తిగత కార్యదర్శి వి.కల్యాణం ఈ అంశంపై తాజాగా స్పందించారు. ఆనాడు తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. 1943 నుంచి 1948 మధ్యకాలంలో గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శిగా కల్యాణం పనిచేశారు. ‘గాంధీజీ అసు హే రామ్‌ అనలేదని నేను ఎప్పుడూ చెప్పలేదు. గాంధీజీ ఆ మాట అనడం నేను వినలేదనే చెప్పాను. ఆయన అనే ఉండొచ్చు. నాకు సరిగా తెలియదు’ అని కల్యాణం వివరించారు. 1948 జనవరి 30న గాంధీజీ హత్యకు గురైన సమయంలో కల్యాణం అక్కడే వున్నారు. ‘గాంధీజీకి తూటా తగిలినప్పుడు అందరూ గట్టిగా అరిచారు. దీంతో నాకేమీ సరిగా వినపడలేదు’అని ఆయన వివరించారు.
views: 1225



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams