Current Affairs Telugu Daily

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్
ఆసియా చాంపియన్స్ హాకీ టోర్నమెంట్‍లో భారత జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరిగా జరిగిన ఫైనల్లో డిఫెడింగ్ చాంపియన్ పాకిస్థాన్‍ను 3 - 2 తో ఓడించి భారతీయుల దీపావళి ఆనందాన్ని రెట్టింపు చేసింది. అటు లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూసిన పాక్‍కు భారత ఆటగాళ్ల వీరోచిత ఆటతో మరోసారి భంగపాటు ఎదురైంది. రూపిందర్ పాల్ సింగ్ (18 వ ని.లో) యూసుఫ్ అఫ్ఘాన్ (23), నిఖిల్ తిమ్మయ్య (51) భారత్‍కు గోల్స్ అందించారు. పాకిస్థాన్ నుంచి మహమ్మద్ అలీమ్ బిలాల్ (26), అలీ షాన్ (38) గోల్స్ చేశారు. 2011 లో జరిగిన ప్రారంభ టోర్నమెంట్ ఫైనల్లోనూ భారత జట్టు పాకిస్థాన్‍ను ఓడించి తొలి చాంఫియన్‍గా నిలిచింది.
views: 950

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams