భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 12న ప్రయోగించిన ఐఎన్ఎస్-1సి ఉపగ్రహం చిత్రాలు తీసి పంపింది. ఐఎన్ఎస్-1సి ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సి40 వాహకనౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది మనదేశానికి చెందిన నానో శాటిలైట్. ఈ ఉపగ్రహంలో ఉపయోగించిన మైనారిసిస్ మల్టీసెక్ట్రాల్ టెక్నాజీని అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ రూపొందించింది. ఈ కెమెరా ద్వారా పంపిన సమాచారం స్థలాకృతి మ్యాపింగ్, వృక్ష సంపద పర్యవేక్షణ, ఏరోసోల్ పరిక్షేప అధ్యయనాలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
views: 1193