Current Affairs Telugu Daily

2017లో ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో హిందీ పదం ‘ఆధార్‌’కు చోటు దక్కించుకుంది
 ‘ఆధార్‌’ను 2017 సంవత్సరపు పదంగా ఆక్స్‌ఫర్డ్‌ హిందీ నిఘంటువు ఎంపిక చేసుకుంది. ఇక్కడ జరుగుతున్న జైపుర్‌ సాహితీ ఉత్సవాల్లో ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది. ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు ‘ఈ ఏడాది హిందీ పదం’గా ‘ఆధార్‌’ను ఎంపిక చేసినట్లు ఆ ప్రకటన వివరించింది. తొలుత ఈ ఏడాది హిందీ పదంగా ఎంపిక చేసుకునేందుకు ‘మిత్రోం’, ‘నోట్‌బందీ’, ‘గౌ రక్షక్‌’ వంటి పదాలను కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. అయితే, ‘ఆధార్‌’ కార్డుపై జరిగిన విస్తృత చర్చలు, వార్తల్లో ఆ అంశం నిలిచిన తీరు...ఇవన్నీ కలగలిసి అదే పదాన్ని ఎంపిక చేసుకునేందుకు దారి తీసినట్లు సౌరభ్‌ ద్వివేది అనే పాత్రికేయుడు వెల్లడించారు.
views: 1136

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams