Current Affairs Telugu Daily

కుందేళ్లపై జన్యు థెరపీతో డిస్క్‌ చికిత్స ప్రయోగానికి డాక్టర్‌ జీపీవీ సుబ్బయ్యకు అవార్డు
వెన్నుముకలో తలెత్తే డిస్క్‌ సమస్యలకు జన్యు చికిత్స ద్వారా పరిష్కార మార్గం లభించే అవకాశాలు మెరుగయ్యాయి.
  • కుందేళ్లపై ఇదే దిశలో తెలుగు వైద్యుడు చేసిన ప్రయోగాలు విజయవంతమవ్వడంతో, జాతీయ స్థాయిలో పరిశోధన పురస్కారం దక్కింది. తర్వాత దశలో కుక్కలు, పందులు, కోతులు వంటి పెద్ద జంతువులపై చేయనున్నారు.
  • రెండో దశలో కూడా విజయవంతమైతే అప్పుడు మనుషులపైనా జన్యుచికిత్స ప్రయోగాలు చేయడానికి అనుమతులు పొందడానికి దరఖాస్తు చేస్తారు.
  • హైదరాబాద్‌లోని స్టార్‌ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వెన్నుముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్‌ జీపీవీ సుబ్బయ్య ఈ ఘనత సాధించారు.
  • ఇటీవల చెన్నైలో జరిగిన అఖిల భారతస్థాయి నిపుణుల సదస్సులో డాక్టర్‌ జీపీవీ సుబ్బయ్య సమర్పించిన పరిశోధన పత్రానికి ‘బేసిక్‌ సైన్స్‌’ విభాగంలో పురస్కారం లభించింది. 

views: 1240

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams