Current Affairs Telugu Daily

భారత్‌బయో రోటావ్యాక్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు 
హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన రోటావైరస్‌ టీకా(వ్యాక్సిన్‌) రోటావ్యాక్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తింపు (ప్రీ క్వాలిఫికేషన్‌) లభించింది.
  • భారత్‌లోనే కాక వర్థమాన దేశాల్లో అభివృద్ధి చేసి డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు పొందిన తొలి రోటావైరస్‌ వ్యాక్సిన్‌ ఇదే.
  • 2015 మార్చిలో ప్రధాని నరేంద్రమోడి ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. తాజాగా డబ్ల్యూహెచ్‌ఓ నుంచి ప్రీక్వాలిఫికేషన్‌ (గుర్తింపు) లభించింది.
  • వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉంటేనే యునిసెఫ్‌, గ్లోబల్‌ అయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ ఇనీషియేటివ్‌ (గవి) వంటి సంస్థలు వాటిని కొనుగోలు చేసి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల కింద సరఫరా చేయగలుగుతాయి.
  • ఇప్పుడు భారత్‌ బయోటెక్‌కు చెందిన ‘రోటావ్యాక్‌’కు ఆ గుర్తింపు లభించడం వల్ల రోటావైరస్‌ వల్ల వచ్చే డయేరియా తీవ్రంగా ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ టీకాను విస్తృతంగా సరఫరా చేయొచ్చు.
  • జాతీయ ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం కింద 2016 నుంచి భారత్‌లో రోటావ్యాక్‌ టీకాను ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 3.5 కోట్ల డోసును భారత్‌ బయోటెక్‌ సరఫరా చేసింది.
భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ - కృష్ణ ఎల్లా 

views: 1207



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams