Current Affairs Telugu Daily

అమర్‌నాథ్‌ యాత్రికులను కాపాడిన బస్సు డ్రైవరు షేక్‌ సలీం గఫూర్‌కు  ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పాదక్‌ అవార్డు 
52 మంది అమర్‌నాథ్‌ యాత్రికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవరు షేక్‌ సలీం గఫూర్‌కు ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పాదక్‌ పురస్కారం లభించింది.
  • ఈ తరహా అవార్డుల్లో దీనిని ద్వితీయ ఉత్తమ పురస్కారంగా పేర్కొంటారు.
  • గత జులై 10వ తేదీన గుజరాత్‌కు చెందిన బస్సులో యాత్రికులను తీసుకుని అనంత్‌నాగ్‌ జిల్లా బటేంగూ ప్రాంతానికి వచ్చేసరికి ఒక్కసారిగా తీవ్రవాదుల గుళ్లవర్షం మొదలైంది.
  • ఆరుగురు యాత్రికులు మరణించారు. 14మంది గాయపడ్డారు. అలాంటి స్థితిలో ధైర్యంగా బస్సును ముందుకు దూకించారు.
  • సురక్షిత ప్రాంతం చేరేదాకా అలా వంగి కూచుని, తుపాకీ తూటా నుంచి కాపాడుకుంటూ బస్సు నడిపారు. 

views: 1151

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams