Current Affairs Telugu Daily

పసుపుతో అల్జీమర్స్‌కు విరుగుడు 
జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో పసుపు ఎంతో ఉపకరిస్తుందని, అల్జీమర్స్‌కు ఇది చక్కటి విరుగుడని అమెరికన్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
  • పసుపులో సమృద్ధిగా ఉండే ‘కుర్కుమిన్‌’కు వాపును తగ్గించే గుణాలు, యాంటీఆక్సిడెంట్‌ సుగుణాలు ఉన్నట్లు ఇదివరకే ప్రయోగాత్మకంగా రుజువైంది.
  • అయితే, మతిమరుపు సమస్యకు కూడా ఇది చక్కటి విరుగడని తాజాగా రుజువైనట్లు వారు వెల్లడించారు. శాస్త్రవేత్తలు తొలుత 50-90 ఏళ్ల వయసున్న...స్వల్ప మతిమరుపుతో ఇబ్బందిపడుతున్న 40 మందిని ఎంపిక చేసుకుని వారిపై పసుపు ప్రభావాన్ని అధ్యయనం చేశారు.
  • మొదట వారి రక్తంలో కుర్కుమిన్‌ శాతాన్ని నమోదు చేసుకున్నారు. వారి మెదడులో జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే అమిలాయిడ్‌, ప్రొటీన్‌ శాతాన్ని కూడా పెట్‌ స్కానింగ్‌ ద్వారా పరీక్షించారు.
  • అనంతరం వారందరికీ కూడా 18 నెలల పాటు క్రమం తప్పకుండా ప్రతి రోజూ 90 మిల్లీగ్రాముల కుర్కుమిన్‌ను ఇచ్చారు.
  • ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో వారిలో మతిమరుపు సమస్య గణనీయంగా తగ్గడంతో పాటు ఏకాగ్రత కూడా పెరిగినట్లు వెల్లడైంది.

views: 1190

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams