Current Affairs Telugu Daily

సమ్మిళిత అభివృద్ధిలో భారత్‌కు 62వ స్థానం 
సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్‌కు 62వ స్థానం లభించింది. మొత్తం 72 వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల స్థితిగతును అధ్యయనం చేసిన ప్రపంచ ఆర్థిక వేదిక ర్యాంకులు ప్రకటించింది. ‘జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, భావి తరాలపై రుణభారం పడకుండా కాపాడడం, అభివృద్ధి-సుస్థిర ప్రగతి, సమ్మిళిత వృద్ధి,  సమానత్వం అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని మదింపు వేసింది.
  • భారత్‌కు ర్యాంకు తక్కువగా వచ్చినా సమ్మిళిత అభివృద్ధి మాత్రం వేగంగా పెరుగుతున్న వర్గంలో ఉంది. అభివృద్ధి-సుస్థిర ప్రగతిలో 66వ స్థానం, తరాల  మధ్య సమానత్వంలో 44వ ర్యాంకు వచ్చింది.
జాబితా
ర్యాంక్‌    దేశం
1    నార్వే
23    అమెరికా
62    భారత్‌
  • ప్రపంచవ్యాప్తంగా పునఃనైపుణ్యం కల్పించాల్సి ఉందని మరో నివేదిక పేర్కొంది. ‘పునఃనైపుణ్య విప్లవం కోసం: అందరికీ ఉద్యోగాల కల్పన’ అనే అంశంపై రూపొందించిన ఈ నివేదికలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఉద్యోగాలు కోల్పోవడంపై విశ్లేషించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం కారణంగా ‘ఆటోమేషన్‌’ పెరుగుతుందని, ఆ కారణంగా ప్రధానంగా 57 శాతం మహిళలు ఉద్యోగాలు కోల్పోతారని ఈ నివేదిక పేర్కొంది.

views: 1218



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams