Current Affairs Telugu Daily

విశ్వసనీయతలో భారత్‌కు 3వ స్థానం 
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ దేశంగా భారత్‌ 3వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వం, వ్యాపారరంగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా పనితీరుపై ఎడల్‌మేన్‌ ట్రస్ట్‌ బారోమీటర్‌ అనే సంస్థ అధ్యయనం చేసి ర్యాంకులు  ఇచ్చింది.
  • ఈ నివేదికను 2018 జనవరి 22న దావోస్‌  ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా విడుదల  చేసింది.
  • విశ్వసనీయతలో చైనా ప్రథమ, ఇండోనేషియా రెండో స్థానాలు  పొందాయి.
  • 28 దేశాల్లో సర్వే చేయగా, 20 దేశాలు ‘అవిశ్వసనీయ ప్రాంతాలు’ అన్న విభాగంలో చేరాయి.
  • 22 దేశాల్లో తొలిసారిగా మీడియా విశ్వసనీయత బాగా పడిపోయింది.
  • భారత్‌లో ‘తక్కువ నమ్మకం ఉన్న కంపెనీ’ సంఖ్య 32 శాతంగా ఉంది.
  • అమెరికా 37 పాయింట్ల మేర విశ్వసనీయత కోల్పోయింది. తక్కువ నమ్మకం ఉన్న అమెరికా కంపెనీల  సంఖ్య 50 శాతంగా ఉంది.
జాబితా
ర్యాంక్‌    దేశం
1    చైనా
2    ఇండోనేషియా
3    ఇండియా
 

views: 1082

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams