Current Affairs Telugu Daily

7 పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌కు అధిక వృద్ధిరేటు సాధించే అవకాశాలు  : డీహెచ్‌ఎల్‌, అసెంచర్‌ 
ప్రపంచంలోని 7 పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో, అధిక వృద్ధిరేటు సాధించే అవకాశాలు  భారత్‌కే ఉన్నాయని అంతర్జాతీయ లాజిస్టిక్స్‌ దిగ్గజం డీహెచ్‌ఎల్‌, కన్సల్టింగ్‌ సంస్థ అసెంచర్‌ రూపొందించిన అంతర్జాతీయ వాణిజ్య కొలమానిని నివేదిక పేర్కొంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎగుమతులకు గణనీయ అవకాశాలు ఉండటం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది.
  • అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం వాటా కలిగిన అమెరికా, బ్రిటన్‌, చైనా, దక్షిణకొరియా, జర్మనీ, జపాన్‌, భారత్‌లో పరిస్థితులను నివేదిక విశ్లేషించింది.
  • కృత్రిమ మేధ, బిగ్‌ డేటా, ఊహాత్మక విశ్లేషణలు ఈ నివేదిక రూపకల్పనకు వినియోగించారు.

views: 1010

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams