Current Affairs Telugu Daily

2018లో భారత్‌ వృద్ధిరేటు 7.4% :IMF
2018లో భారత్‌ వృద్ధిరేటు 7.4% ఉంటుందని, చైనా 6.8 శాతం వృద్ధినే సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) తెలిపింది. వర్థమాన దేశాల్లో భారత్‌ వృద్ధిరేటే అధికంగా ఉంటుందని పేర్కొంది. పెద్దనోట్ల రద్దుకు తోడు వస్తు సేవ పన్ను (GST) అమలు వల్ల గతేడాది భారత వృద్ధిరేటు నెమ్మదించిందని తెలిపింది.
  • స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రపంచ ఆర్థిక భవిష్యత్తుపై నివేదికను సంస్థ విడుదల చేసింది.
  • 2019లో భారత్‌ 7.8 శాతం% వృద్ధిరేటును సాధిస్తుందని అంచనా వేసింది.
  • చైనా వృద్ధి 6.4 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది.
  • వర్థమాన దేశాల వృద్ధిరేటుకు సంబంధించి 2017 అక్టోబరులో వేసిన అంచనాల్లో ఎటువంటి మార్పులు  చేయలేదు.
IMF-International Monetary Fund

views: 1005

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams