Current Affairs Telugu Daily

మోసుల్‍లో 900 మంది ఉగ్రవాదుల హతం
మోసుల్ నగరం స్వాదీనం కోసం జరుగుతున్న పోరులో ఇంతవరకూ 900 మంది ఐసిన్ ఉగ్రవాదులు హతమయ్యారని ఐక్యరాజ్య సమితి గురువారం వెల్లడించింది. మరోవైపు ఇరాకీ దళాలు నగరం దక్షిణ, తూర్పు, ఉత్తర ప్రాంతం వైపు దూసుకు పోతున్నాయని పేర్కొంది. ఇరాకీ, కుర్దీష్, బలగాలకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు గగనతల దాడులతో సాయం చేస్తున్నాయని తెలిపింది. మోసుత్‍లో 3500 - 5000 మంది సరిహద్దుల్లో మరో 2000 మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉండవచ్చని గతంలో అమెరికా నిర్దారించింది. వీరిలో దాదాపు 800 - 900 వరకు మరణించారని అమెరికా సైనికాధికారి జోసఫ్ వోటెల్ చెప్పారు. మరోవైపు నగరం నుంచి పారిపోయి వస్తోన్న వేలాది మందితో మోసుల్ సరిహద్దుల్లోని శిబిరాలు కిక్కిరిసిపోయాయి. Oct - 17 న మోసుల్ స్వాదీనం చేసుకోవడం కోసం ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకూ 11,700 మంది పారిపోయి వచ్చారని ఇరాకీ మంత్రి వెల్లడించారు.
views: 1003

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams