Current Affairs Telugu Daily

తెలంగాణకు మరో 30 అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు 
విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచి వారి ఆలోచనలను పదును పెట్టుకునేలా ప్రోత్సహించేందుకు పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌(ATL)లు  తెలంగాణ రాష్ట్రానికి మరో 30 మంజూరయ్యాయి.
  1. దేశవ్యాప్తంగా రెండో విడత కింద 1500 ప్రయోగశాలల ఏర్పాటుకు నీతి ఆయోగ్‌ ఆమోదం తెలపగా తెలంగాణకు 30 దక్కాయి. గతంలో మొదటి విడత కింద మూడు దశల్లో తెలంగాణకు 29 మంజూరయ్యాయి.
  2. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలకు 2,441 ప్రయోగశాలలను మంజూరు చేయగా తెలంగాణకు 59 లభించాయి. వాటిల్లో ఎక్కువగా కేంద్రీయ, జవహర్‌ నవోదయ విద్యాయాలు, ప్రైవేట్‌ పాఠశాలలే ఉన్నాయి.
  3. ఈ ప్రయోగశాల  ఏర్పాటుకు 5 సంవత్సరాల్లో రూ.10 లక్షలు అందజేస్తారు.
  4. పాఠశాల యాజమాన్యాలు  1500 చదరపు అడుగుల  విస్తీర్ణం ప్రత్యేకంగా కేటాయించాలి. ఇంటర్నెట్‌ సౌకర్యం, కంప్యూటర్‌, సైన్స్‌ ప్రయోగశాల, గ్రంథాలయం తదితర సౌకర్యాలు  ఉండాలి. 
  • ఆంధ్రప్రదేశ్‌కు తాజాగా 131 అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌(ATL)లు మంజూరవగా అంతకుముందు 33 దక్కాయి.
ATL-Atal Tinkering Laboratories

views: 1198

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams