Current Affairs Telugu Daily

UGC నెట్‌లో మార్పులు
UGC నెట్‌లో పలు మార్పులు  చేస్తూ  విశ్వవిద్యాలయాల నిధులసంఘం(UGC) నిర్ణయం తీసుకుంది.
  • డిగ్రీ కళాశాల అధ్యాపకులు, సహాయ ఆచార్యుల ఉద్యోగాలకు అర్హత పొందేందుకు, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(JRF)కోసం ఏటా జులైలో, నవంబరు లేదా డిసెంబరులో రెండుసార్లు జాతీయ అర్హత పరీక్ష (NET) నిర్వహిస్తారు.
  • UGC తరఫున CBSE ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ప్రభుత్వోద్యోగాలు  దక్కించుకునే అవకాశం ఉండటం.. పీహెచ్‌డీలో సీటుతోపాటు ప్రతినెలా భారీగా ఫెలోషిప్‌ అందుకునేందుకు వీలు ఉండటంతో ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 84 సబ్జెక్టుల్లో దాదాపు 6 లక్షల మంది హాజరవుతుంటారు. ఇందులో కేవలం  6 శాతం మాత్రమే ఉత్తీర్ణులవుతారు. 
మార్పులు 
  • ఇప్పటివరకు పేపర్‌-1 (1.15 గంటలు), పేపర్‌-2 (1.15 గంటలు), పేపర్‌-3 (2.30 గంటలు) ఉండేవి. మొత్తం ఒకే రోజు రాయాలి. ఇక నుంచి 2 పేపర్లు మాత్రమే ఉంటాయి. పేపర్‌-1 (గంట), పేపర్‌-2 (2 గంటలు) ఉంటుంది. ఇప్పటివరకు 350 మార్కులకు పరీక్ష జరగగా ఇక నుంచి 300 మార్కులకే నిర్వహిస్తారు.
  • ఇప్పటివరకు అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టులో రెండు పేపర్లు ఉండగా దాన్ని ఒకటికి పరిమితం చేశారు. దాంతో మార్కులు 250 నుంచి 200కి తగ్గాయి. 
  • జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (JRF) పొందేందుకు గరిష్ట వయసును 28 సం॥ నుంచి 30కి పెంచారు. కేటగిరీల వారీగా మినహాయింపులు యథాతథంగా ఉంటాయి
  • UGC ఛైర్మన్‌ : ప్రొఫెసర్‌ ధీరేంద్రపాల్‌సింగ్‌
UGC-University Grants Commission
JRF-Junior Research Fellowships
NET- National Eligibility Test
CBSE-Central Board of Secondary Education
Ph.D-Doctor of Philosophy

views: 901

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams