Current Affairs Telugu Daily

డిల్లీలో తెలంగాణ గిరిజన మేళా
తెలంగాణా గిరిజన సాంస్కృతిక సంబురాలకు దేశ రాజధాని డిల్లీ వేదికైంది. మూడు రోజులుగా ప్రగతి మైదాన్‍లో జరుగుతున్న జాతీయ గిరిజన మేళాలో గురువారం రాష్ట్రానికి చెందిన గిరిజనులు చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొమ్రం భీం, అదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు ఈ ప్రదర్శనలు ఇచ్చారు. థింసా, గుస్సాడీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పు చప్పుళ్లు, వినూత్నమైన పర్ర, డోలు, వెట్టీ, సమ్మెల, తుడుం వాయిద్యాలతో ప్రగతి మైదాన్ గిరిజన గూడేలను తలపించింది. ఎటుచూసినా ఆదివాసీ కళలు, సంస్కృతి, దర్శనమిచ్చింది. దేశం నలుమూలల నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున ఈ మేళాలో పాల్గోంటున్నారు.
views: 1242

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams