Current Affairs Telugu Daily

సైన్స్‌, ఇంజినీరింగ్‌ పట్టభద్రుల తయారీలో అగ్రస్థానాన భారత్‌
- సైన్స్‌, ఇంజినీరింగ్‌ పట్టభద్రులను తయారుచేయడంలో భారత్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు ‘ఆన్యుయల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఇండికేటర్స్‌’ పేరుతో అమెరికాలోని నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ వెల్లడించిన నివేదిక  స్పష్టం చేసింది. 
- 2014లో సైన్స్‌, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రపంచవ్యాప్తంగా బ్యాచిలర్‌ పట్టాలు పొందినవారిలో నాలుగింట ఒక వంతు మంది భారతీయులేనని పేర్కొంది. 
- ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మంది సైన్స్‌, ఇంజినీరింగ్‌ల్లో బ్యాచిలర్‌ కోర్సు పూర్తిచేశారని, వీరిలో భారతీయు 25%, చైనీయు 22%, ఐరోపా సమాఖ్యకు చెందినవారు 12%, అమెరికన్లు 10% ఉన్నారని వెల్లడించింది. 
- పరిశోధక (డాక్టోరల్‌) డిగ్రీల్లో మాత్రం అమెరికానే ముందంజలో ఉంది. 
- 2014లో ఆ దేశంలో 40,000 మంది ఈ పట్టాలు అందుకున్నారు. 
- వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా (34,000), రష్యా (15,000), బ్రిటన్‌ (14,000), భారత్‌ (13,000) ఉన్నాయి. 
- పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)కి సంబంధించిన వ్యయం చేయడంలో కూడా అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.
- ప్రపంచవ్యాప్త వ్యయంలో 26% వాటా అమెరికాదే. 21% వాటాతో చైనా రెండో స్థానంలో ఉంది.
- మిగతా దేశాలు, ముఖ్యంగా చైనా గణనీయమైన ప్రగతిని సాధిస్తుండటంతో శాస్త్ర సాంకేతిక కార్యాకలాపాలల్లో అమెరికా వాటా తగ్గిపోతోందని ఈ నివేదిక వెల్లడించింది.

views: 1025



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams