Current Affairs Telugu Daily

కౌమార దశ నిర్వచనాన్ని మార్చాలని శాస్త్రవేత్తల అభిప్రాయం
- మారిన ఆరోగ్య, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కౌమార దశ నిర్వచనాన్ని కూడా మార్చాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 
- ప్రస్తుతం 14-19 సం॥ వయసు మధ్య కాలాన్ని కౌమార దశగా పరిగణిస్తున్నారు. 
- దీన్నే టీనేజ్‌గా వ్యవహరిస్తుంటారు. మెదడులోని హైపోథామస్‌ ప్రాంతంలో హార్మోన్లు విడుదలై లైంగికపరమైన మార్పు చేటుచేసుకోవడాన్ని కౌమారదశ ఆరంభంగా గుర్తిస్తున్నారు. 
- సాధారణంగా ఇది 14వ ఏట ప్రారంభమవుతుంది.
- అయితే పౌష్టికాహారం లభ్యత ఇతర కారణాల పదో ఏటలోనే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి.
- ఇంగ్లండ్‌ వంటి పారిశ్రామిక దేశాల్లో గత 150 సం॥ల గణాంకాలను పరిశీలిస్తే బాలికల్లో 12-13 సం॥ల వయసులోనే రుతుక్రమం ప్రారంభమవుతోంది. 
- దాంతో పాటు చదువు కారణంగా 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎవరూ పెళ్లిమాటే ఎత్తడం లేదు. 
- అంటే యవ్వనం వచ్చినా బాధ్యతపరంగా వారు కౌమార దశలో ఉన్నట్టే. 
- అందువల్ల 10-25 సంవత్సరాల  మధ్యనున్న కాలాన్ని కౌమార దశగా పరిగణిస్తే బాగుటుందని సిఫార్సు చేశారు. 
- ఇందుకుసంబంధించి లాన్సెట్‌ ఛైల్డ్‌ అండ్‌ అడోల్‌సెంట్‌ హెల్త్‌ జర్నల్‌లో వ్యాసం ప్రచురితమైంది.

views: 1221Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams