Current Affairs Telugu Daily

ఒడిశాలో 250 కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాల వితరణ
- భూ కబ్జాలు సర్వసాధారణ విషయంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఓ వ్యక్తి 250 కుటుంబాలకు ఇళ్లస్థలాలు దానంగా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. 
- ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా జయపురం సొంబారుతోటలో శ్రీమద్విరాట్‌ పోతులూరు విరాట్‌ బ్రహ్మేంద్రస్వామి దేవాలయ ప్రధాన ధర్మకర్త ఎం.సూర్యనారాయణ ఆచారి ఈ భూదానం చేశారు. 
- 2018 జనవరి 18న జగన్నాథపూర్‌ మౌజాలోని బ్రాహ్మిణి గ్రామం ప్రాంతంలో 250 కుటుంబాలకు 30 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పున్న ఇళ్లస్థలాలను ఉచితంగా పంపిణీ చేశారు. 
- సుమారు రూ.4 కోట్ల విలువైన 3ఎకరాల స్థలానికి సంబంధించి ఎవరికి వారికి పట్టా రూపంలో స్వయంగా అందజేశారు. 

views: 1095

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams