Current Affairs Telugu Daily

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌
- మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రధాన ఎన్నిక కమిషనర్‌ అచల్‌కుమార్‌ జ్యోతి 2018 జనవరి 18న ప్రకటించారు. 
- త్రిపురలో 2018 ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్‌లో 2018 ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. 
- మూడింటి ఫలితాలనూ 2018 ఫిబ్రవరి మార్చి 3న వ్లెడిస్తామని తెలిపింది. 
- మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర అసెంబ్లీ కాలం వరుసగా 2018 మార్చి 6, 13, 14తో ముగుస్తున్నాయి. 
- ఒక్కో రాష్ట్రంలో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. 
- త్రిపుర ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ 2018 జనవరి 24 నుంచి మొదవుతుంది. 
- 31తో ఈ ప్రక్రియ ముగుస్తుంది. 2018 ఫిబ్రవరి 3 వరకూ నామినేషన్లను వెనక్కు తీసుకునేందుకు అవకాశముంటుంది. 
- మేఘాలయ, నాగాలాండ్‌లో నామినేషన్ల ప్రక్రియ 2018 జనవరి 31తో మొదవుతుంది. 
- 2018 ఫిబ్రవరి 7తో ఇది ముగుస్తుంది. 2018 ఫిబ్రవరి 12 వరకూ నామినేషన్లను వెనక్కు తీసుకునేందుకు అవకాశముంటుంది. 
- త్రిపురలో 25,69,216 మంది ఓటర్లు ఉండగా.. నాగాలాండ్‌లో 11,89,264 మంది, మేఘాలయలో 18,30,104 మంది ఓటర్లున్నారు.
మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ : సుకుమార్‌ సేన్‌
20వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ : నజీం జైదీ
ప్రస్తుత (21వ)ప్రధాన ఎన్నికల కమిషనర్‌ : అచల్‌కుమార్‌ జ్యోతి

views: 990



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams