Current Affairs Telugu Daily

29 వస్తువులు, 54 సేవలపై తగ్గిన జీఎస్టీ 
- వినియోగదారుల పన్ను భారం తగ్గిస్తూ వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) మండలి 2018 జనవరి 18న నిర్ణయించింది. 
- 29 వస్తువులు, 54 విభాగాల్లోని సేవలపై పన్ను తగ్గించింది. 
- ఈ నిర్ణయం 2018 జనవరి 25 నుంచి అమల్లోకి రానుంది. 
- కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగిన వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. 
- సరళతరంగా రిటర్నుల సమర్పణపై ఇన్ఫోసిస్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ నందన్‌ నిలేకని ప్రజంటేషన్‌ ఇచ్చారు. 
- దీనిపై అధ్యయనానికి బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌మోడి అధ్యక్షతన, నీలేకని, జీఎస్టీ నెట్‌వర్క్‌ ఛైర్మన్‌ అజయ్‌ భూషణ్‌ పాండే సభ్యులుగా కమిటీ ఏర్పాటయింది.
- పన్ను ఎగవేతను అరికట్టడంలో భాగంగా 2018 ఫిబ్రవరి 1 నుంచి ఈ-వే బిల్లుల విధానం అమలు చేస్తామని జైట్లీ వెల్లడించారు. 
- రూ.50 వేలకు మించిన సరకును ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్తే వాహనదారులు తప్పకుండా ఈ-వేబిల్లును తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. 
- రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు సరకు తీసుకెళ్లినా ఈ విధానాన్ని అమలు చేయాలని 15 రాష్ట్రాలు నిర్ణయించాయని వివరించారు. 
- హస్తకళా వస్తువులపై కమిటీ సమర్పించిన సిఫార్సును సమావేశంలో ఆమోదించారు. 
- సరఫరా వివరాలు పొందుపరిచే జీఎస్టీఆర్‌-1 ఫారం సమర్పణ ఆలస్యమయితే విధించే ఆలస్య రుసుమును రోజుకు రూ.50కు తగ్గించారు. 
- మరికొన్ని ఫారాలకూ ఈ రుసుము తగ్గింది.
28% నుంచి 18%కు పన్ను తగ్గిన వస్తువు
- పాత, ఇదివరకే ఉపయోగించిన వాహనాలు (మధ్య, పెద్ద తరహా కార్లు, ఎస్‌వీయూలు) విక్రయించే వ్యాపారుల లాభాలపై పన్ను తగ్గింపు. అయితే వారు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోకుండా ఉంటేనే ఇది వర్తిస్తుంది. వీటిపై ఇంతవరకు 15 శాతం కాంపెన్సేషన్‌ సెస్‌ ఉండగా, దాన్ని పూర్తిగా ఎత్తివేశారు.
- జీవ ఇంధనం ఉపయోగించి కేవలం ప్రజా రవాణా కోసం మాత్రమే వినియోగించే బస్సులు
28% నుంచి 12%కు పన్ను తగ్గిన వస్తువులు
- పాత వాహనాలు (మధ్య, పెద్ద తరహా కార్లు, ఎస్‌వీయూలు తప్ప) విక్రయించే వ్యాపారుల లాభాలపై పన్ను తగ్గింపు. వారు కూడా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను తీసుకొని ఉండకూడదు.
18% నుంచి 12%కు పన్ను తగ్గిన వస్తువులు
- సుగర్‌ బాయిల్డ్‌ కన్ఫెక్షనరీ 
- 20 లీటర్ల మంచి నీటి బాటిళ్లు 
- ఎరువుల్లో ఉపయోగించే ఫాస్ఫారిక్‌ ఆసిడ్‌ 
- జీవ ఇంధనం 
- జీవ ఎరువులు (బాసిల్లస్‌ తురింజస్‌-బి.టి.లాంటివి.. అందులోని వివిధ రకాలు/వర్గాలు) 
- వేప పూత ఉన్న ఎరువులు 
- నిమ్మగడ్డి 
- వెదురుతో చేసే భవన నిర్మాణ సామగ్రి 
- బిందు సేద్యం పరికరాలు (తుంపర సేద్యం పరికరాలు సహా) 
- మెకానికల్‌ స్ప్రేయర్‌
18% నుంచి 5%కు పన్ను తగ్గిన వస్తువులు
- చింతపండు గింజల పొడి 
- కోన్‌లోని గోరింటాకు 
- ఇళ్లకు వంటగ్యాస్‌ సరఫరా చేసే ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు 
- శాస్త్ర, సాంకేతిక పరికరాలు, ఉపగ్రహాలు ప్రయోగించడానికి ఉపయోగించే సామగ్రి (వీటిపై 18% ఐజీఎస్టీ కూడా ఉండగా, దాన్ని 5 శాతానికి తగ్గింపు)
12% నుంచి 5%కు పన్ను తగ్గిన వస్తువులు
- గడ్డి, కేన్‌ తదితర సామగ్రితో తయారు చేసే పరికరాలు
3% నుంచి 0.25 శాతానికి పన్ను తగ్గిన వస్తువులు
- వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు
పన్ను పూర్తిగా లేనివి 
- విభూతి లివినికిడి పరికరాల విడిభాగాలు, ఇతర అనుబంధ సామగ్రి 
- నూనె తీసేసిన వరి ధాన్యం తౌడు
15% నుంచి సున్నా శాతానికి పన్ను తగ్గిన వస్తువులు
- అంబులెన్స్‌లు, 10-13 సీట్ల బస్సులు
కొన్నింటిపై పన్ను పెంపు ఇలా
0% నుంచి 5 శాతానికి పన్ను పెరిగిన వస్తువులు
- వరి ధాన్యం తౌడు (నూనె తీయనది)
12% నుంచి 18 శాతానికి పన్ను పెరిగిన వస్తువులు
- సిగరెట్‌ ఫిల్టర్‌ రాడ్స్‌
పన్ను తగ్గిన కొన్ని సేవల వివరాలు
- మెట్రో రైళ్ల నిర్మాణం: 18% నుంచి 12% 
- చిన్న తరహా హౌస్‌ కీపింగ్‌ సేవలు : 5% (ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ఇవ్వరు) 
- టైరింగ్‌ సేవలు: 18% నుంచి 5% 
- థీమ్‌ పార్కుల్లో ప్రవేశాలు: 28% నుంచి 18%
GST-Goods and Services Tax

views: 1174



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams