Current Affairs Telugu Daily

ప్రభుత్వ నిధులతో క్రిస్టియన్లకు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి : NCM
- ముస్లింల కోసం ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం(AMU), జామియా మిలియా ఇస్లామియాల మాదిరిగా క్రిస్టియన్లకు కూడా విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలని అల్పసంఖ్యాక వర్గాల జాతీయ కమిషన్‌(NCM) అభిప్రాయపడింది.
- 2016-17కు సంబంధించి రూపొందించిన వార్షిక నివేదికలో కమిషన్‌ ఈ సిఫార్సు చేసింది. 
- వచ్చే ఏడేళ్లకు గాను కార్యాచరణ ప్రణాళికనూ వివరించింది. 
- ప్రభుత్వ నిధులతో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటులో భారత కాథలిక్‌ బిషప్‌ సమాఖ్యకు కూడా భాగస్వామ్యం కల్పించాలని ఎన్‌సీఎం ఛైర్మన్‌ సయ్యద్‌ ఘయోరుల్‌ హసన్‌ రిజ్వీ పేర్కొన్నారు.
- కనీసం ఒక్క విశ్వవిద్యాలయాన్ని అయినా క్రిస్టియన్ల కోసం నెలకొల్పాలని అభిప్రాయపడ్డారు. - 2011జనాభా గణాంకాల ప్రకారం క్రిస్టియన్లలో అక్షరాస్యత శాతం 74.34, ముస్లింలలో నిరక్ష్యరాస్యత శాతం 42.72 కాగా హిందువుల్లో 36.4 శాతం, సిక్కుల్లో 32.49 శాతం, బౌద్ధ మతస్తుల్లో 28.17 శాతం చదువుకు దూరంగా ఉన్నారు.
NCM-National Commission for Minorities
AMU-Aligarh Muslim University

views: 910



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams