Current Affairs Telugu Daily

వృద్ధాశ్రమంలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌
- దేశంలో ఎన్నికల సంస్కరణలకు బాటలు వేసిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ ప్రస్తుతం చెన్నైలోని వృద్ధాశ్రమంలో శేషజీవితాన్ని గడుపుతున్నారు. 
- నగరంలోని గురుకులం ఓల్డేజ్‌ హోంలో భార్య జయలక్ష్మితో కలిసి శేషన్‌ నివసిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శేషన్‌ దంపతులను చూసేవారు లేకపోవడంతో వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్నారు. 
- కేరళలోని పాక్కాడ్‌లో వారికి ఇల్లు ఉన్నా పిల్లలులేకపోవడంతో వృద్ధాశ్రమంలో నివసించేందుకు మొగ్గు చూపారు. 
- శేషన్‌ దంపతులు తమ ఆదాయంలో నుంచి ఆశ్రమంలోని సహచరుల వైద్య సేవలు, ఇతర అవసరాలను తీరుస్తున్నారు. 
- ప్రభుత్వంలో అత్యున్నత సేవలు అందించినందుకు గాను 1996లో శేషన్‌కు రామన్‌ మెగసెసే అవార్డు లభించింది.

views: 1131

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams