ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్‌లో పూజితకు ప్రథమ స్థానం 
- ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బొమ్మాళి పూజిత అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. 
- తల్లిదండ్రులు రమణమ్మ, సింహాచలం వ్యవసాయ కూలీలుగా జీవనం పొందుతూ బాలికను చదివిస్తున్నారు.
-  ప్రపంచవ్యాప్తంగా 8, 9, 10 తరగతుల విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు వివిధ సబ్జెక్టుల వారీగా ఏటా ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్‌ పరీక్షలను నిర్వహిస్తారు. 
- గణితంపై ఆసక్తి ఉన్న పూజిత ఈ పరీక్షకు మూడు నెలల ముందు నుంచి ప్రత్యేకంగా కృషి చేసింది. 
- 2017 డిసెంబరు 14న జరిగిన పరీక్షలో గణితంలో 60కి 60 మార్కులు సాధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. 

views: 1145

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams