చిన్నారి హత్యపై పాకిస్థాన్‌ యాంకర్‌ వినూత్న నిరసన 
- పాకిస్థాన్‌లో 8 ఏళ్ల బాలిక జైనాబ్‌పై పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై ఆ దేశ యాంకర్‌ కిరణ్‌ నాజ్‌ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. 
- 2018 జనవరి 10 రాత్రి సమా టీవీ ఛానల్‌లో ఆమె తన కుమార్తెను పక్కన కూర్చోబెట్టుకొని వార్తలు చదివారు. 
- నేను ఇప్పుడు కిరణ్‌ నాజ్‌ను కాను. ఒక తల్లిని. అందుకే నా కుమార్తెను పక్కన కూర్చోబెట్టుకున్నా అని ఆమె పేర్కొన్నారు.
-  జైనాబ్‌ ఉదంతంపై తన ఆక్రోశాన్ని ఆమె వెళ్లగక్కారు. ఆ దురాగతానికి పాల్పడ్డ వారిని పట్టుకోవడంలో విఫలం కావడంపై ఒక తల్లిగా కలత చెందుతున్నట్లు చెప్పారు.
-  ‘‘నేడు జైనాబ్‌ గురించి తప్ప నాకు మాట్లాడటానికి ఏమీ లేదు’’ అని వేదనాభరిత స్వరంతో చెప్పారు. 
- 2018 జనవరి 4న జైనాబ్‌ అపహరణకు గురైంది. 5 రోజు తర్వాత కసుర్‌ పట్టణంలో ఓ చెత్తకుప్పలో ఆ చిన్నారి మృతదేహం దొరికింది. 
- సౌదీ అరేబియాలో ఉన్న ఆ బాలిక తల్లిదండ్రులు 2018 జనవరి 10న పాకిస్థాన్‌కు తిరిగొచ్చారు. 
- హంతకుడిని అరెస్టు చేసే వరకూ తమ చిన్నారి మృతదేహాన్ని ఖననం చేయబోమని స్పష్టంచేశారు. 
- ఈ ఘటన కసుర్‌లో అల్లర్లకు దారితీసింది. ఇందులో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు.

views: 810
Current Affairs Telugu
e-Magazine
April-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams