సిక్కుల ఊచకోత కేసులపై సిట్‌ ఏర్పాటు
- నాటి సిక్కుల ఊచకోతకు సంబంధించి మూసివేసిన 186 కేసుల పర్యవేక్షణకు కొత్తగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌)ని సుప్రీంకోర్టు 2018 జనవరి 11న ఏర్పాటు చేసింది. 
- డిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎన్‌.ధింగ్రా నేతృత్వంలోని ఈ త్రిసభ్య బృందంలో ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ దులార్‌, రిటైర్డ్‌ ఐజీ రాజ్‌దీప్‌సింగ్‌లు సభ్యులు. 
- విచారణ లేకుండానే నాటి సిట్‌ ఈ కేసులను మూసివేసినట్లు - గతంలో ఏర్పాటైన పర్యవేక్షక సంఘం సుప్రీంకోర్టుకు నివేదించింది. 
- ఈ నేపథ్యంలో ఏర్పాటైన కొత్త సిట్‌ను 2 నెలల్లోగా ఆయా కేసుల స్థాయినివేదిక సమర్పించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్ర నేతృత్వంలోని జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
- కొత్త సిట్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ ధింగ్రాకు విశేష అనుభవం ఉంది. 
- పార్లమెంటుపై దాడి సహా పలు కీలక కేసులను గతంలో విచారించారు. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాపై ఆరోపణలున్న హర్యానా భూ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన సంఘానికి నేతృత్వం వహించారు. 
- విచారణ కోర్టు న్యాయమూర్తిగా ఆయన 1984 సిక్కు ఊచకోత కేసులను కూడా విచారించారు. 

views: 844
Current Affairs Telugu
e-Magazine
April-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams