2018-19లో భారత వృద్ధి 7.3% : వరల్డ్‌ బ్యాంక్‌ 
- రాబోయే పదేళ్లలో వృద్ధిపరంగా ఇతర వర్ధమాన దేశాలకు మించి భారత్‌ రాణిస్తుందని వరల్డ్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. 
- ప్రభుత్వం ఎన్నో కీలక సంస్కరణలను చేపడుతున్నందున, భారత్‌కు ఆ సత్తా ఉందని భావిస్తున్నామని అభిప్రాయపడింది.
- ప్రపంచ దేశాల వృద్ధి అంచనాలతో కూడిన నివేదికను వరల్డ్‌ బ్యాంక్‌ విడుదల చేసింది. 
- ఇందులో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2018-19) భారత్‌ 7.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొంది. 
- అలాగే తదుపరి రెండు ఆర్థిక సంవత్సరాల్లో 7.5 శాతం వృద్ధి రేటును సాధించొచ్చని పేర్కొంది. 
- పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను అమలు లాంటివి అవరోధాలు సృష్టించినప్పటికీ, 2017-18లో భారత్‌ 6.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది.

views: 657
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.