సత్యం కేసులో పీడబ్ల్యూసీపై సెబీ రెండేళ్ల నిషేధం 
- సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ కుంభకోణం కేసులో ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ)కి పాత్ర ఉందని తేలినందున, ఈ గ్రూప్‌ సంస్థలేవీ రెండేళ్ల పాటు నమోదిత సంస్థకు ఆడిట్‌ నివేదికలు ఇవ్వకుండా నిషేధిస్తూ, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. 
- అప్పట్లో సత్యం కంప్యూటర్‌ ఖాతాలు పరిశీలించిన పీడబ్ల్యూసీతో పాటు దాని ఇద్దరు భాగస్వాములు రూ.13 కోట్లు అక్రమంగా లబ్ధిపొందినందున, ఆ మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించింది. 
- సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ కుంభకోణం వెలుగుచూసిన 9 ఏళ్ల తరవాత, ఆడిట్‌ సంస్థలపై సెబీ ఆదేశాలు జారీ అయ్యాయి.
- అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన 4 ఆడిట్‌ సంస్థల్లో ఒకటైన పీడబ్ల్యూసీలపై, సెబీ కఠిన చర్యలు తీసుకుంది. 
- పీడబ్ల్యూసీ బ్రాండ్‌పై దేశీయంగా ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ సేవందిస్తున్న సంస్థలు ప్రత్యక్షంగా/పరోక్షంగా అయినా నమోదిత సంస్థలు, సెబీ వద్ద నమోదైన మధ్యవర్తిత్వ సంస్థలకు రెండేళ్ల పాటు ఆడిట్‌ నివేదికలు అందించే వీలు లేదని సెబీ తన 108 పత్రాల ఆదేశాల్లో పేర్కొంది. 
- పీడబ్ల్యూ నెట్‌వర్క్‌ కింద ఉన్న సంస్థకు 2017-18 ఆడిట్‌ వ్యవహారాలు అప్పగిస్తే, వాటిపై మాత్రం ఈ ప్రభావం ఉండదని తెలిపింది.
- పీడబ్ల్యూ బెంగళూరుతో పాటు, దాని పాత భాగస్వాములైన ఎస్‌.గోపాలకృష్ణన్‌, శ్రీనివాస్‌ తాళ్లూరిలు అక్రమంగా పొందిన రూ.13,09,01,664ను 12 శాతం వడ్డీతో కలిసి 45 రోజుల్లోగా సంయుక్తంగా చెల్లించాలి. 
- ఇందుకు 2009 జనవరి 7 నుంచి చెల్లింపు తేదీని పరిగణనలోకి తీసుకుంటారు.
- గోపాలకృష్ణన్‌, తాళ్లూరిలు ఆడిట్‌ నివేదికలు ఇవ్వకుండా మూడేళ్ల పాటు నిషేధం విధించింది.
PwC-PricewaterhouseCoopers 

views: 741
Current Affairs Telugu
e-Magazine
April-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams