యూకే ప్రభుత్వంలో ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు రుషి సునాక్‌ 
- ఇన్ఫోసిస్‌ అధినేత నారాయణమూర్తి అల్లుడు రుషి సునాక్‌ యూకే ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. 
- ఆయనతో సహా ముగ్గురు భారత సంతతి ఎంపీలకు నూతన మంత్రివర్గంలో కొత్తగా చోటు కల్పించాలని ప్రధాని థెరిసా మే నిర్ణయించారు. 
- దీంతో కేబినెట్‌లో భారత సంతతివారి సంఖ్య నాలుగుకి చేరుతుంది. 
- అలోక్‌శర్మ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. 
- రిచ్‌మండ్‌ (యార్క్‌షైర్‌) నుంచి కన్సర్వేటివ్‌ పార్టీ తరఫున సునాక్‌ (37) ఎంపీగా ఎన్నికయ్యారు. 
- గృహనిర్మాణ, సమాజాల, స్థానిక ప్రభుత్వాల శాఖకు సహాయ మంత్రి హోదాలో ఆయన నియమితులయ్యారు. 
- సునాక్‌ తల్లి ఫార్మసిస్ట్‌ కాగా తండ్రి వైద్యుడు. 
- గోవాకు చెందిన సుయెల్లా ఫెర్నాండెజ్‌ (బ్రెగ్జిట్‌ శాఖ సహాయ మంత్రి), శైలేష్‌ వర (ఉత్తర ఐర్లాండ్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి) కూడా కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

views: 760
Current Affairs Telugu
e-Magazine
April-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams