సిక్కుల ఊచకోతపై కొత్త సిట్ ఏర్పాటుకు సుప్రీం నిర్ణయం
- సిక్కుల ఊచకోతకు సంబంధించి 186 కేసులను తిరిగి విచారించేందుకు కొత్తగా త్రిసభ్య ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
- ఈ మేరకు పేర్లను సూచించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్ర నేతృత్వంలోని జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం 2018 జనవరి 10న కేంద్రాన్ని అడిగింది.
- హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో..పదవీ విరమణ చేసిన (డీఐజీకి తక్కువ కాని హోదా), ప్రస్తుతం పనిచేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులు ఇందులో ఉంటారని ధర్మాసనం తెలిపింది.
- 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన దాడుల్లో ఒక్క డిల్లీలోనే 2,733 మంది ప్రాణాలు కోల్పోయారు.
- నాటి హింసాత్మక ఘటనలకు సంబంధించి మొత్తం 250 కేసులు నమోదుకాగా.. 9 కేసుల దర్యాప్తు కొనసాగుతోందని, మిగతావి మూసివేసినట్లు గతంలో కేంద్రం తెలిపింది.
- ఈ మేరకు 241 కేసులను మూసివేస్తూ నాటి సిట్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించేందుకు 2017 ఆగస్టు 16న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జె.ఎం.పంచాల్, జస్టిస్ కె.ఎస్.పి.రాధాకృష్ణన్‌లతో కూడిన పర్యవేక్షక సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం నియమించింది.
- ఈమేరకు 186 కేసులను విచారణ లేకుండానే మూసివేసినట్లు గుర్తించిన సంఘం సమగ్ర నివేదికను సమర్పించింది.
views: 1048