Current Affairs Telugu Daily

‘ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌’ కేసు విచారణ నుంచి వైదొలగిన జస్టిస్‌ దీపక్‌మిశ్ర
- ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ లావాదేవీల కేసుకు సంబంధించి ఒక విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్ర 2018 జనవరి 10న వైదొలగారు. 
- తమ ఆస్తులు జప్తు చేసుకోవాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం, మరో రెండు సంస్థలు దాఖలు చేసిన విజ్ఞప్తులపై విచారణ నుంచి ఆయన వైదొలగారు. 
- ఈ ధర్మాసనంలో ఆయనతో పాటు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ కూడా ఉన్నారు. 
- 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుకు సంబంధించిన కేసు విచారణలో దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను వాదను విన్నానని, అందువల్ల ఈ పిటిషన్లు వినదల్చుకోలేదని జస్టిస్‌ దీపక్‌ మిశ్ర చెప్పారు. 
- జస్టిస్‌ అరుణ్‌మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తుందని ధర్మాసనం చెప్పింది.

views: 1012Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams