- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన ఛైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త కె.శివన్ నియమితులయ్యారు.
- ఎ.ఎస్.కిరణ్ కుమార్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
- అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, అంతరిక్ష కమిషన్ ఛైర్మన్‌గా శివన్ నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ 2018 జనవరి 10న ఆమోదించింది.
- 3 సం॥ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
- శివన్ ప్రస్తుతం త్రివేండ్రంలోని విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం సంచాలకుడిగా ఉన్నారు.
- శివన్ 1980లో మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.
- బెంగళూరులోని ఐఐఎస్సీలో 1982లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి, ఆ ఏడాదే ఇస్రోలో చేరారు.
- పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) ప్రాజెక్టుకు కీలక సేవలందించారు.
- ఇస్రోలో వివిధ హోదాల్లో పనిచేశారు.
- 2014 ఏప్రిల్‌లో చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డు స్వీకరించారు.
- ఆయన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ తాలుకా సరకల్వివై గ్రామానికి చెందినవారు.
- గతేడాది ఇస్రో పంపిన 104 ఉపగ్రహా ప్రయోగంలో కీలక భూమిక పోషించారు.
views: 973