కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు
- కేంద్ర మంత్రివర్గం 2018 జనవరి 10న పు నిర్ణయాలు తీసుకొంది. 
- సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారంలో ఆటోమేటిక్‌ రూట్‌లో 100% ఎఫ్‌డీఐలకు అనుమతి. 
- ఆటోమేటిక్‌ రూట్‌ అంటే భద్రతాపరమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 
- పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌-డీఐపీపీ) సిఫార్సులు సరిపోతాయి. 
- నిర్మాణ అభివృద్ధి రంగంలోనూ ఇదే తరహా వెసులుబాటు కల్పించింది. 
- అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియాలో 49% పెట్టుబడులు పెట్టడానికి అప్రూవల్‌ రూట్‌లో విదేశీ సంస్థలకు అనుమతి ఇచ్చింది. 
- అప్రూవల్‌ రూట్‌ అంటే వివిధ శాఖల అనుమతులు తీసుకొని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. 
- ప్రైమరీ మార్కెట్‌ ద్వారా కూడా పవర్‌ ఎక్స్చేంజీల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుమతి ఇవ్వనుంది. 
- వైద్య పరికరాలు (మెడికల్‌ డివైజస్‌)కు ఉన్న నిర్వచనాన్ని సవరించి, ఆ రంగంలోనూ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కలిగించింది. 
- విదేశీ నిధులు పొందే కంపెనీలతో సంబంధం ఉన్న ఆడిట్‌ సంస్థల్లోనూ విదేశీ పెట్టుబడులకు అనుమతించింది. 
- ఎన్‌డీఏ ప్రభుత్వం తొలిసారిగా 2016 జూన్‌లో విదేశీ పెట్టుబడుల విధానాన్ని సరళీకరించగా, రెండో విడతగా ప్రస్తుతం మార్పులు చేసింది.
- నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 
- స్థిరాస్తి వ్యాపారంలో నూరు శాతం ఎఫ్‌డీఐకు అవకాశం లేదని, కేవలం స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థల్లోనే ఈ పెట్టుబడులకు అవకాశం ఉందని స్పష్టంచేసింది.
- కర్ణాటకలోని తుంగభద్ర స్టీల్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థను మూసివేయాలని నిర్ణయం. 
- ఆ సంస్థ ఆస్తులను కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించనుంది.  
- మానసిక వికలాంగుల జాతీయ ట్రస్ట్‌ పాలక మండలి పదవీకాలాన్ని మూడేళ్లకు పరిమితం చేస్తూ నిర్ణయం   కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌)లో గ్రూప్‌ ‘ఎ’ కేడర్‌ను సమీక్షించడానికి ఆమోదం.
- దీనివల్ల వివిధ ర్యాంకుల్లో 25 పోస్టులు సృష్టికి అవకాశం ఏర్పడుతుంది.
- శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి కెనడాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆమోదం  పార్లమెంటు సభ్యుల స్థానిక అభివృద్ధి పథకాన్ని (ఎంపీల్యాడ్స్‌)ను 14వ ఆర్థికసంఘం చివరి వరకు (31.3.2020) కొనసాగించడానికి ఆమోదం. 
- ఈ పథకం కింద పార్లమెంటు ఉభయ సభల్లోని సభ్యులకు అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కొక్కరికి ఏటా రూ.5 కోట్ల చొప్పున ఏటా రూ.3,950 కోట్లు కేటాయిస్తున్నారు.

views: 636
Current Affairs Telugu
e-Magazine
January-2018
Download
Current Affairs Telugu
e-Magazine
December-2017
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.