Current Affairs Telugu Daily

ఎల్లో బుక్‌ను అన్ని పాఠశాలల్లో వినియోగించేలా చూడాలి : ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 
- విద్యార్థులకు ఆరోగ్యకర ఆహారంపై తాము రూపొందించిన పుస్తకాన్ని(ఎల్లో బుక్‌) అన్ని పాఠశాలల్లో వినియోగించేలా చూడాలని భారత ఆహార ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. 
- ఈమేరకు విద్యా బోర్డుకు సూచించాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది. 
- ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2017 సెప్టెంబరులో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చింది. 
- పిల్లల వయసుకు అనుగుణంగా 3 కేటగిరీల్లో (4-7, 8-12, 13-17 ఏళ్ల) రూపొందించిన పుస్తకంలో సురక్షిత ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకర అలవాట్లు, సమతులాహారం, లంచ్‌బాక్స్‌ ఎలాఉండాలి? తదితర అంశాలను పొందుపరిచింది. 
- వ్యక్తిగతంగా మార్గదర్శనం చేసే ఈ పుస్తకాలను పాఠశాలల్లో బోధన ప్రణాళికలో భాగంగా వినియోగించవచ్చని తెలిపింది. 
- సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్రాల విద్యాబోర్డు, పోషకాహార నిపుణులు, విద్యావేత్తలను సంప్రదించిన అనంతరం పుస్తకాన్ని రూపొందించినట్లు వెల్లడించింది. 
- దీంతోపాటు కుటుంబాలు, హోటళ్లు, వివిధ సంస్థల ఉద్యోగుల కోసం కూడా 3 రంగుల్లో పుస్తకాలను రూపొందించింది.

views: 1050



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams