Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో భారత సంతతి పార్లమెంటేరియన్ల సదస్సు 
- ప్రపంచం నలుమూలల్లో పార్లమెంటేరియన్లుగా ఉన్న భారత సంతతి వ్యక్తుల తొలి సదస్సును 2018 జనవరి 9, 10 తేదీల్లో న్యూడిల్లీలో నిర్వహించారు.
-  రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఫ్రాన్స్‌, ఫిజీ, స్విట్జర్లాండ్‌, మారిషస్‌ సహా 24 దేశాలకు చెందిన 134 మంది ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. 
- మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చి 102 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  
- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్రమోడి మాట్లాడుతూ ప్రపంచంలో ఎవరి భూభాగం, వనరులపై భారత్‌కు ఆశలేదని పేర్కొన్నారు. 
- ఇతర దేశాలకు తానిచ్చే అభివృద్ధి సాయానికి ‘ఇచ్చి-పుచ్చుకో’ అనే సూత్రం ప్రాతిపదిక కాదన్నారు.  
- సిద్ధాంతాల ప్రాతిపదికన ప్రపంచంలో విభజన వచ్చిన నేపథ్యంలో ‘అందరితో కలసి అందరి వికాసం’ సిద్ధాంతాన్ని భారత్‌ నమ్ముతోందని మోడి చెప్పారు. 

views: 1108



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams