Current Affairs Telugu Daily

సైబర్‌ నేరగాళ్లతో ఆధార్‌కు ఎప్పటికైనా ముప్పే 
- సైబర్‌ నేరగాళ్ల కారణంగా ఆధార్‌ సమాచారానికి ఎప్పటికైనా ముప్పేనని భారతీయ రిజర్వ్‌ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న బ్యాంకింగ్‌ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, పరిశోధన సంస్థ తేల్చింది. 
- ఈ మేరకు ఒక పత్రాన్ని వెలువరించింది. 
- కేవలం రూ.500 వెచ్చించి ఆధార్‌ గణాంక నిధి నుంచి కీలక సమాచారాన్ని కొట్టేయవచ్చని ఇటీవల ఒక కథనం వెలువడిన నేపథ్యంలో ఈ సంస్థ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకొంది.  
- కేవలం రూ.500 ఖర్చుచేస్తే ఆధార్‌ సమాచారాన్ని చౌర్యం చేయవచ్చని ప్రపంచానికి చాటిన పాత్రికేయుడిపై కేసు పెట్టే బదులు పురస్కారాన్ని ఇవ్వాలని అమెరికా ప్రజావేగు, అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సీఐఏ) మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అభిప్రాయపడ్డారు.
 - పౌరుల గోప్యతను పరిరక్షించే విధానాన్ని భారత ప్రభుత్వం సంస్కరించాన్నారు. 

views: 982

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams