Current Affairs Telugu Daily

సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదు : సుప్రీంకోర్టు
- సినిమాహాళ్లలో చలనచిత్రాన్ని ప్రదర్శించడానికి ముందు జాతీయ గీతాలాపనను వినిపించడం తప్పనిసరికాదని, ఐచ్ఛికమని సుప్రీంకోర్టు 20018 జనవరి 9న స్పష్టం చేసింది. 
- జాతీయ గీతాలాపనకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను ప్రభుత్వం నియమించిన సంఘానికి వదిలేసింది. 
- 2016 నవంబరు 30న ఇచ్చిన ఉత్తర్వును ఈ మేరకు సవరించింది. - చలనచిత్రం ప్రదర్శనకు ముందు సినిమాహాళ్లలో జాతీయ గీతాలాపనను వినిపించడాన్ని ఆ నాటి ఉత్తర్వు ద్వారా సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. 
- సినిమాహాళ్లలో జాతీయ గీతాలాపనను వినిపించడం తప్పనిసరా కాదా అన్న విషయం సహా  వివిధ అంశాలపై 12 మంది సభ్యులతో కేంద్రం నియమించిన అంతర్‌ మంత్రిత్వశాఖల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌వ్కిర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం చెప్పింది.
- జాతీయ గౌరవానికి అవమానాలు కలగకుండా నిరోధించే  చట్టం-1971లో మార్పుకు సిఫార్సు చేసేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్రం అఫిడవిట్‌ సమర్పించగా ధర్మాసనం అందుకు ఆమోదం తెలిపింది. 
- పిటిషనర్లు తమ అభిప్రాయాలను ఈ సంఘం ముందు ఉంచడానికి అనుమతిచ్చింది. - సినిమాహాళ్లలో జాతీయగీతాలాపన వినిపించే సమయంలో దివ్యాంగులు నిలబడాల్సిన అవసరం లేకుండా గతంలో ఇచ్చిన మినహాయింపు 12 మంది సభ్యుల సంఘం తుది నిర్ణయం తీసుకునేవరకూ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. 
- జాతీయ గీతానికి గౌరవం ఇవ్వాల్సిందేనని, ఆపించేటప్పుడు తగినవిధంగా ప్రవర్తన ఉండాల్సిందేనని చెప్పింది.  
- ప్రభుత్వం నియమించిన సంఘం 6 నెలల్లోగా నివేదిక సమర్పిస్తుందని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ ధర్మాసనానికి చెప్పారు. ఏయే సందర్భాల్లో జాతీయగీతాన్ని ఆపించాలో, అటువంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో వివరిస్తూ మార్గదర్శకాలు రూపొందించేందుకు విస్తృత సంప్రందింపులు అవసరమని, అందుకే ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. - మార్గదర్శకాలు రూపొందించేంత వరకు 2016లో ఇచ్చిన ఉత్తర్వులకు ముందున్న పరిస్థితిని పునరుద్ధరించవచ్చని కోరింది. 
- 12 మంది సభ్యులు సంఘానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న బి.ఆర్‌.శర్మ నేతృత్వం వహిస్తారు. 
- 11 మంత్రిత్వశాఖలు, విభాగాల నుంచి కార్యదర్శి స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. 

views: 980



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams