Current Affairs Telugu Daily

సముద్ర మార్గంలో హజ్‌ యాత్రకు సౌదీ అరేబియా అంగీకారం
- హజ్‌ యాత్రికులు జెడ్డాకు చేరుకునేందుకు 23 ఏళ్ల క్రితం మూసివేసిన సముద్ర మార్గాన్ని పునరుద్ధరించాలన్న భారత్‌ విజ్ఞప్తిని సౌదీ ప్రభుత్వం అంగీకరించింది. 
- ఈ మేరకు ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంపై సౌదీ హజ్‌, ఉమ్రా మంత్రి మహ్మద్‌ బిన్‌ 2018 జనవరి 7న సంతకం చేసినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ చెప్పారు. 
- 1995 వరకు హజ్‌ యాత్రికులు ముంబైలోని మజ్‌గావ్‌ (ఎల్లో గేట్‌) నుంచి సౌదీలోని జెడ్డాకు ఈ మార్గం ద్వారానే ప్రయాణించేవారు. 
- అప్పట్లో ఈ ప్రయాణానికి సుమారు 12 నుంచి 15 రోజుల సమయం పట్టేది. 
- అయితే ప్రస్తుతం అత్యాధునిక ఓడలు అందుబాటులో ఉండటంతో యాత్రకు 4 రోజుల సమయం మాత్రమే పట్టనుంది.

views: 999

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams