Current Affairs Telugu Daily

నీటిలోని హానికర నైట్రేట్‌లను తొలగించే కొత్త శుద్ధీకరణ విధానం 
- మంచినీటిలోని ప్రమాదకర నైట్రేట్‌లను తొలగించే కొత్త విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. 
- దీనిలో పల్లాడియం సమ్మేళనాలను ఉత్ప్రేరకాలుగా ఉపయోగించారు. 
- ఇవి నైట్రేట్‌లను నీరు, నత్రజని వాయువుగా విడగొడతాయి. 
- శిశువులు, గర్భిణులకు నైట్రేట్లు విపరీతమైన చేటుచేస్తాయి.
- ఒక్కోసారి క్యాన్సర్‌కు కూడా ఇవి కారణమవుతాయి. 
- నీటిలో వీటి అవశేషాలను తొలగించేందుకు ఇదివరకు సూక్ష్మ బంగారం గోళాలను ఉపయోగించారు.
- అయితే ఇవి నైట్రేట్‌లను నైట్రైట్‌, ఆక్సీజన్‌లుగా విడగొట్టాయి. 
- నైట్రేట్‌ కంటే నైట్రైట్‌లు మరింత ప్రమాదకరం. 
- దీంతో నైట్రేట్‌ను సురక్షితంగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అమెరికాలోని రైస్‌ వర్సిటీ నిపుణులువీ ఈ పరిశోధన చేపట్టారు. 
- వీరు ఇండియం పూతపూసిన పల్లాడియం గోళాలను ఉత్ప్రేరకాలు ఉపయోగించారు. 
- దీంతో నైట్రేట్‌లను నత్రజని వాయువుగా మార్చడం సాధ్యపడింది.

views: 989

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams