Current Affairs Telugu Daily

జీవం పుట్టుకపై నూతన సిద్ధాంతం 
- భూమిపై జీవం పుట్టుక గుట్టువిప్పే సరికొత్త సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. 
- ఈ పరిశోధనకు అమెరికాలోని స్క్రిప్స్‌ పరిశోధన సంస్థ(టీఎస్‌ఆర్‌ఐ) అధ్యాపకులు, భారత సంతతికి చెందిన రామనారాయణన్‌ కృష్ణమూర్తి నేతృత్వం వహించారు. 
- దీనిలో సిట్రిక్‌ ఆమ్ల వయం(సీఏసీ) చర్యలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. 
- ఆక్సిజన్‌ను తీసుకునే జీవులన్నీ కణాల్లో నిల్వచేసిన శక్తిని విడుదల చేసేందుకు సీఏసీ చర్యపైనే ఆధారపడతాయి. 
- ఈ చర్యను 400 కోట్ల ఏళ్ల క్రితం అప్పుడు అందుబాటులోవున్న పదార్థాలే జరిపినట్లు ప్రస్తుతం పరిశోధకులు చెబుతున్నారు. 
- మెలనేట్‌ వలయం, హెచ్‌కేజీ వలయంగా పిలిచే రెండు జీవయేతర వలయాలు సీఏసీ చర్యలకు బాటలు పరిచినట్లు ప్రయోగపూర్వకంగా వారు నిరూపించారు. 
- ఈ రెండు వలయాలూ క్రమంగా కొత్త పదార్థాలకు చర్యల్లో భాగం కల్పిస్తూ  కార్బన్‌డైఆక్సైడ్‌, అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేశాయనీ వారు చెబుతున్నారు. 
- సీఏసీ చర్యలో అంతిమంగా ఉత్పత్తయ్యేది అమైనో అమ్లాలే. 
- ఈ రెండు వలయాలు చర్యలను క్రమంగా ఎంజైమ్‌ల్లాంటి జీవ అణువులు భర్తీ చేసినట్లు వారు భావిస్తున్నారు.

views: 987

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams