Current Affairs Telugu Daily

GVK చేతికి నవీ ముంబయి విమానాశ్రయం 
- నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి 30 ఏళ్ల పాటు జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (GVKPIL) నిర్వహించనుంది. 
- ఈ మేరకు కన్సెషన్‌ ఒప్పందం కుదిరింది. 
- అనుబంధ కంపెనీ ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా నవీ ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీలో జీవీకే పవర్‌కు 74 శాతం వాటా ఉంటుంది. 
- మిగిలిన 26 శాతం వాటా మహారాష్ట్ర నగర, పారిశ్రామికాభివృద్ధి సంస్థ (సిడ్కో)కు దక్కుతుంది. 
- నవీ ముంబయి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి నిర్వహించడానికి ఎంఐఏఎల్‌, సిడ్కోలు కలిసి ఎన్‌ఎంఐఏఎల్‌ను ఏర్పాటు చేశాయి. 
- ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఒప్పందంపై ఎంఐఏఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జి.వి.కె.రెడ్డి, సిడ్కో వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) భూషణ్‌ గాగ్రానీ సంతకాలు చేశారు. 
- ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ హాజరయ్యారు. 
- నవీ ముంబయి విమానాశ్రయం ప్రాజెక్టులో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సిడ్కో నోడల్‌ ఏజెన్సీగా ఉంది. 
GVKPIL-GVK Power & Infrastructure Limited 

views: 1106

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams