Current Affairs Telugu Daily

అతి పెద్ద ప్రధాన సంఖ్యను కనుగొన్న జొనాథన్‌ పేస్‌
- ప్రపంచంలోనే ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద ప్రధాన సంఖ్యను శాస్త్రవేత్త అమెరికాకు చెందిన జొనాథన్‌ పేస్‌ కనుగొన్నారు. 
-2017 డిసెంబర్‌ 26న అమెరికాకు చెందిన జొనాథన్‌ పేస్‌ అనే 51 ఏళ్ల ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ ఈ ఘనత సాధించారు. 
- 2ను 7,72,32,917 సార్లు గుణించి, ఆ తర్వాత అందులో నుంచి ‘1’ ని తీసివేశారు. 
- ఆ వచ్చిన సంఖ్యలో 2,32,49,425 అంకెలుంన్నాయి. - ఇప్పటివరకు తెలిసిన ప్రధాన సంఖ్య కన్నా ఎం77232917 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఎక్కువగా ఉన్నాయి. - అత్యంత అరుదుగా ఉండే ఈ ప్రధాన సంఖ్యను మెర్సెన్నె ప్రధాన సంఖ్యలు అంటారు. 
- 350 ఏళ్ల కిందటే ఈ ప్రధాన సంఖ్య గురించి అధ్యయనం చేసిన ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త మారిన్‌ మెర్సెన్నె పేరు వీటికి పెట్టారు. 
- ఈ కొత్త ప్రధాన సంఖ్యను ఆరు రోజుల పాటు ఆగకుండా లెక్కించారు. - ఎం77232917 ఇప్పటి వరకు కనుగొన్న 50వ మెర్సెన్నె ప్రధాన సంఖ్య. 
- గ్రేట్‌ ఇంటర్నెట్‌ మెర్సెన్నె ప్రైమ్‌ సెర్చ్‌ (జీఐఎంపీఎస్‌) అనే సాఫ్ట్‌వేర్‌ సాయంతో ప్రధాన సంఖ్యలు కనుగొనేందుకు వేల మంది వంటీర్లు నిత్యం ప్రయతిస్తుంటారు. 
- ఈ ప్రధాన సంఖ్యను కనుగొన్న వారికి రూ.50 వేలను పారితోషికంగా అందిస్తారు. 
- జొనాథన్‌ పేస్‌ గత 14 ఏళ్లుగా ప్రధాన సంఖ్యను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 

views: 1349



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams