Current Affairs Telugu Daily

శంషాబాద్‌ కేంద్రంగా కేథలిక్‌ డయాసిస్‌ ఆవిష్కరణ 
- కేరళలోని సిరో-మబార్‌ కేథలిక్‌ చర్చి పరిధిలో శంషాబాద్‌ డయాసిస్‌ను 2018 జనవరి 7న ఆవిష్కరించారు. 
- తొలి బిషప్‌గా రఫాయెల్‌ తట్టిల్‌ పట్టాభిషిక్తులయ్యారు. ఈ డయాసిస్‌ను లాంఛనంగా వాటికన్‌ పరిధిలోకి చేర్చారు. 
- ఈ సందర్బంగా బాలాపూర్‌ మండలం బడంగపేట్‌లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌, సిరో-మలబార్‌ కేథలిక్‌ చర్చి మేజర్‌ ఆర్చిబిషప్‌ కార్డినల్‌ జార్జి అలెంచెర్రి, భారత కేథలిక్‌ బిషప్‌ల కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు కార్డినల్‌ బసేలిస్‌ క్లీమిస్‌, వాటికన్‌ ప్రతినిధి ఆర్చిబిషప్‌ సిరిల్‌ వాసిల్‌, హైదరాబాద్‌ ఆర్చిబిషప్‌ తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు. 
- శంషాబాద్‌ డయాసిస్‌ సిరో-మలబార్‌ కేథలిక్‌ చర్చి పరిధిలోని 31వ డయాసిస్‌. 
- దీని పరిధిలో ఈశాన్య ప్రాంతాలు సహా 24 రాష్ట్రాలు (దాదాపు 100 నగరాలు) ఉంటాయి. 
- కేరళలోని సిరో-మలబార్‌ కేథలిక్‌ చర్చి ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనది. 
- ఏసు క్రీస్తు శిష్యుడైన సెయింట్‌ థామస్‌ అపోస్టెల్‌ దీనిని క్రీ.శ.52లో నెలకొల్పారు. 
- పాశ్యాత్య దేశాలకు క్రైస్తవ మతం చేరకముందే ఇక్కడ చర్చి ఏర్పాటు చేయబడింది
- సెయింట్‌ థామస్‌ అపోస్టెల్‌ కేరళలోని కొండుంగళ్లూర్‌లో చర్చి నెలకొల్పారు. వాటికన్‌ పరిధిలో ఉన్న మూడో పెద్ద చర్చి ఇదే. 
- మొదటి రెండు స్థానాలను లాటిన్‌ కేథలిక్‌ చర్చి, ఉక్రెయిన్‌ కేథలిక్‌ చర్చిలు పొందాయి. 
- ఈ చర్చి పరిధిలో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కెనడాల్లో కూడా డయాసిస్‌లు ఉన్నాయి. 
- పోర్చుగీసు మిషనరీలు రావడంతో కొంతకాలం పాటు ఈ చర్చి అధికారాలు తగ్గాయి. 
- 1886లో కేవలం త్రిస్సూర్‌, కొట్టాయం ప్రాంతాలకే పరిమితమయింది. 
- 1955లో దీని ప్రరిధిని మొత్తం కేరళ, కర్ణాటక, తమిళనాడులకు విస్తరిస్తూ వాటికన్‌లోని పోప్‌ నిర్ణయం తీసుకున్నారు. 
- శంషాబాద్‌ డయాసిస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు 2017 అక్టోబరు 9న పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రకటించారు. 
- దీని పరిధిలోకి మిగిలిన రాష్ట్రాలను తీసుకురావడంతో ఈ చర్చి దేశమంతటా విస్తరించినట్టయింది.

views: 1071



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams