Current Affairs Telugu Daily

పాక్‌కు రూ.7,290 కోట్ల సాయం నిలిపివేత
ఉగ్రవాదుపై చర్యలు  తీసుకోవడం లేదన్న కారణంతో పాకిస్థాన్‌కు ఏటా ఇచ్చే 1.15 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.7,290 కోట్లు) భద్రత సాయాన్ని ఆమెరికా ప్రభుత్వం 2018 జనవరి 5న నిలిపివేసింది.
- ఇందులో 2016 సంవత్సరానికి కాంగ్రెస్‌ ఆమోదించిన 255 మిలియన్‌ డాలర్ల (రూ.1,616 కోట్లు) విదేశీ మిలటరీ నిధులు  కూడా ఉన్నాయి.
- ఇదికాకుండా రక్షణ శాఖ సంకీర్ణ మద్దతు నిధుల కింద 2017 సంవత్సరానికి కేటాయించిన మొత్తం 900 మిలియన్‌ డాలర్ల (రూ.5,703 కోట్లు)ను, ముందు సంవత్సరాల్లో ఖర్చుకాకుండా మిగిలిన నిధులను కూడా రద్దు చేసింది. 

views: 1246



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams