Current Affairs Telugu Daily

లోక్‌సభలో వినియోగదారుల పరిరక్షణ బిల్లు 
మార్కెట్‌లోని వివిధ మోసాల నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన వినియోగదారు పరిరక్షణ బిల్లును 2018 జనవరి 5న లోక్‌సభలో కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ ప్రవేశపెట్టారు.
- తప్పుడు ప్రకటను ఇస్తే రూ.50 లక్షల వరకు జరిమానా, అయిదేళ్ల వరకు జైలు  శిక్ష, కల్తీ చేస్తే రూ.10 లక్షల జరిమానా, జీవితకాల జైలు  శిక్ష విధించాలని ఈ బిల్లులో  ప్రతిపాదించారు.
- సమస్యల పరిష్కారానికి కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు.
- వివాదాలపరిష్కారానికి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పి.పి.చౌధరి లోక్‌సభలో బిల్లు  ప్రవేశపెట్టారు.
- సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రం పేరుతో దీనిని ఏర్పాటు చేయనున్నారు.

views: 1161

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams