Current Affairs Telugu Daily

త్వరలో కొత్త రూ.10 నోటు 
చాక్లెట్‌ రంగులో కొత్త రూ.10 నోటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందుబాటులోకి తేనుంది.
- మహాత్మాగాంధీ సిరీస్‌లో, ఆర్‌బీఐ గవర్నరు ఉర్జిత్‌ ఆర్‌ పటేల్‌ సంతకంతో త్వరలోనే కొత్త రూ.10 నోటు రానుందని ఆర్‌బీఐ తెలిపింది.
- ఈ నోటుకు వెనకాల ప్రసిద్ధ కోణార్క్‌ సూర్య భగవాన్‌ దేవాలయ చిత్రం ఉంటుంది. దేశ సాంస్కృతిక సంపదకు ప్రతీకగా ఈ దేవాలయ చిత్రాన్ని ముద్రించారు.
- నోటుకు ముందు వైపు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం, అశోక స్థూపం ముద్ర, వాటర్‌ మార్క్‌, నోటు సంఖ్య (అంకె పరిమాణం పై నుంచి కిందకు వచ్చేసరికి పెరుగుతూ ఉంటాయి).
- వెనకాల కోణార్క్‌ దేవాలయంతో పాటు ముద్రణా సంవత్సరం, స్వచ్ఛ భారత్‌ చిహ్నం, నినాదం, దేశ భాషల్లో పది రూపాయిు, హిందీ దేవనగరి లిపిలో 10 అంకె ముద్రించి ఉంటాయి.
- కొత్త నోటు వచ్చినప్పటికీ ఇప్పటివరకు చలామణిలో ఉన్న ఇతర రూ.10 సిరీస్‌ నోట్లన్నీ చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ పేర్కొంది.

views: 1281

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams