Current Affairs Telugu Daily

సూర్యుడి కన్నా 200 రెట్లు భారీ తారలు  
మన పాలపుంత నక్షత్ర మండలానికి పొరుగునున్న గెలాక్సీలో భారీ తారలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.
- సూర్యుడితో పోలిస్తే ఈ భారీ తార పరిమాణం 10 రెట్ల కన్నా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.
- పాలపుంతకు సమీపంలో ఉన్న లార్జ్‌ మెగాలానిక్‌ క్లౌడ్‌ గెలాక్సీలోని నక్షత్ర జనన ప్రాంతమైన 30 డోరాడస్‌లోని దాదాపు 1000 భారీ తారలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు.
- వీటిలో 250 నక్షత్రాల ద్రవ్యరాశి సూర్యుడి కన్నా 15 నుంచి 200 రెట్లు ఎక్కువగా ఉంది.
- సూర్యుడి కన్నా 10 రెట్లు పెద్దగా ఉండే నక్షత్రాలు ఒక్క శాతం లోపే ఉంటాయన్న అంచనా ప్రస్తుతం ఉంది.
- ఊహించినదాని కన్నా అవి ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.

views: 1134

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams